సమంత కారు టైర్ పేల్చిన ఆకతాయి

Wed,June 29, 2016 11:55 AM
samantha face bad situation at madhuri

గ్లామరస్ బ్యూటీ సమంత తాజాగా ఓ షాపు ప్రారంభోత్సవానికి మధురై వెళ్ళింది. ఈ అమ్మడు వస్తుందనే విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ పరిసర ప్రాంతం చాలా కోలాహాలంగా మారింది. పోలీసులు కూడా భారీగానే బందోబస్త్ ఏర్పాటు చేశారు. కాకపోతే అక్కడ జరిగిన సంఘటన సమంతని దిగ్బ్రాంతికి గురి చేసిందట.

షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన సమంత కారులో నుండి దిగగానే అభిమానులు ఒక్కసారిగా ఆమె మీదకు వచ్చేశారు. వారిని కంట్రోల్ చేయడం పోలీసుల తరం కాలేదు. ఇక ఈ సందర్భంలో ఓ ఆకతాయి సమంత కారు టైర్‌ని పేల్చేశాడు. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. అభిమానులందరు ఏం జరిగిందో తెలియక భయంతో పరుగులు తీశారు. కాస్త తొక్కిసలాట కూడా జరిగింది. అయితే కాసేపటి తరువాత నిర్వాహకులు సమంతని వేరే కారులో సేఫ్‌గా పంపించేశారు.

3240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles