స్పెయిన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మంత‌, చైతూ

Wed,May 8, 2019 01:47 PM
Samantha enjoys Holiday Trip with chaitu

ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మనం చిత్రం త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య క‌లిసి న‌టించిన చిత్రం మ‌జిలీ. ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. స‌క్సెస్‌ని ఎంజాయ్ చేసేందుకు స‌మంత‌, చై హాలీడ్ ట్రిప్‌గా స్పెయిన్‌కి వెళ్ళారు. బార్సిలోనాలోని ప్రముఖ చెఫ్ డానీ గార్సియాకు చెందిన రెస్టారెంట్ ముందు వీరిరివురు క‌లిసి ఫోటోకి ఫోజులిచ్చారు. ఆ ఫోటోని చైతూ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఇప్పటి వరకు రుచి చూసిన అద్భుతమైన వంటకాల్లో ఇదీ ఒకటి’ అని చైతన్య తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వీరిద్ద‌రు క‌లిసి ఉన్న మ‌రో ఫోటో కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప‌డ‌క కుర్చీలో చైతూ, స‌మంత పొట్టి బ‌ట్ట‌లు కూర్చొని సేద తీరుతున్న‌ట్టుగా ఫోటోలో క‌నిపిస్తూ ఉంది. స‌మంత మ‌న్మ‌థుడు 2 చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ని తెలుస్తుండ‌గా ఇటీవ‌ల పోర్చుగ‌ల్‌కి వెళ్ళి అక్క‌డ మ‌న్మ‌థుడు 2 టీంని క‌లిసింది. వారితో ఫోటోలు దిగింది. ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. చిత్రంలో స‌మంత పాత్ర సుమారు ఐదు నుండి ప‌ది నిమిషాలు ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు చైతూ వెంకీమామ అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

View this post on Instagram

One of the best meals ever ! @danigarcia7

A post shared by Chay Akkineni (@chayakkineni) on

1813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles