టీమ్ అంతా నా మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌య్యారు : స‌మంత‌

Fri,February 22, 2019 08:00 AM
samantha emotional tweet goes viral

నాగ‌చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న స‌మంత ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌తో క‌లిసి మ‌జిలి సినిమా చేస్తుంది. ఇందులో మ‌ధ్య త‌ర‌గ‌తి గృహిణి పాత్ర పోషించింది. వేలంటైన్స్‌డే సంద‌ర్భంగా మ‌జిలి చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఈ టీజ‌ర్‌లోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అయితే తాజాగా చిత్ర షూటింగ్ పూర్తైంది. ఈ సంద‌ర్భంగా ఇటు చైతూ, అటు స‌మంత ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని తెలిపారు. స‌మంత ట్వీట్ మాత్రం కాస్త ఎమోష‌న‌ల్‌గా ఉండ‌డంతో ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతుంది. మ‌జిలి చిత్ర షూటింగ్ పూర్తైంది. ఏప్రిల్ 5న చిత్రం విడుద‌ల కానుంది. బ్యూటీఫుల్ పీపుల్‌తో వ‌ర్క్ చేయ‌డం గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌గా అనిపించింది. చిత్ర బృందం అంతా నా మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌య్యారు. దేవుడు అంద‌రిని దీవించాల‌ని కోరుకుంటున్నాను అని ట్వీట్‌లో తెలిపింది సామ్. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తుంది.

మ‌జిలీ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ . వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది . నాగచైతన్య, సమంత పాత్రలు, వారి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.1858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles