తుఫాను వచ్చే ముందు నిశ‌బ్ధంలా..

Sat,June 9, 2018 09:40 AM
Samantha dubbing starts for second half movies

ఈ ఏడాది స‌మంత హ‌వా మాములుగా లేదు. పెళ్ళి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తూ వ‌రుస హిట్స్ సాధిస్తుంది. 2018లో తాను చేసిన అన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. రంగస్థలంలో రామలక్ష్మీగా, మహానటిలో మధురవాణిగా, అభిమన్యుడు చిత్రంలో రతిదేవిగా అద్భుత పాత్రలు పోషించి అలరించింది. అయితే సమంత తొలిసారి డీ గ్లామర్ పాత్ర పోషించిన రామలక్ష్మీ పాత్రకి మాత్రం ఎక్కువ మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సూపర్ డీలక్స్, సీమ రాజా అనే తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. చైతూ ప్రధాన పాత్రలో శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్న సినిమా కూడా చేస్తుంది సామ్. ఇదీ కాక యూ టర్న్ అనే రీమేక్ చిత్రం కూడా చేస్తుంది.

ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో స‌మంత చేసిన అన్నీ సినిమాలు మంచి విజ‌యం సాధిండంతో ద్వితీయార్ధం ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో అభిమానులు ఉన్నారు. ఈ అమ్మ‌డు మాత్రం సెకండాఫ్‌లో కూడా త‌న‌కి మంచి విజ‌యాలు ద‌క్కుతాయ‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ క్ర‌మంలో త‌న ట్విట్ట‌ర్‌లో ‘తుఫాను వచ్చే ముందు ఉండే నిశ్శబ్దంలా..... ఫస్ట్‌ హాఫ్‌ సక్సెస్‌ అయినట్లు సెకండాఫ్‌ కూడా ఉండబోతోంది... సూప‌ర్ డీలక్స్‌, సీమ రాజా, యూ టర్న్ చిత్రాల‌కి డబ్బింగ్‌ మొదలైంది’ అంటూ త‌నుడ‌బ్బింగ్ చెబుతున్న ఫోటో ఒక‌టి షేర్ చేస్తూ ఈ కామెంట్ పెట్టింది. ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూనే అటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో ఇన్ని విజ‌యాలు సాధించ‌డం స‌మంత‌కే చెల్లిందని చెప్ప‌వ‌చ్చు.

6658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles