చైతూకి బ‌ర్త్‌డే విషెస్ చెప్ప‌న‌న్న‌ స‌మంత‌

Thu,November 23, 2017 12:22 PM
samantha doesnt say wishes to naga chaitanya

క్యూట్‌గా సైలెంట్‌గా ఉండే హీరో నాగ చైత‌న్య‌. ఇటీవ‌ల స‌మంత‌తో ఏడ‌డుగులు వేసిన చైతూ ఈ రోజు త‌న 31వ బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్నాడు. పెళ్లి త‌ర్వాత ఇది తొలి బ‌ర్త్‌డే కాగా అటు చైతూకి ఇటు సమంతకి ఈ డే స్పెష‌ల్ అని చెప్ప‌వ‌చ్చు. ఇక త‌న హ‌బ్బి బ‌ర్త్‌డేకి సామ్ ఎలా విషెస్ చెప్పి షాక్ ఇస్తుందా అని అంద‌రు ఎదురు చూశారు. కాని స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లినాటి ఫోటో పోస్ట్ చేసి "హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీథింగ్.. నేను విష్ చెయ్యను, ప్రతి రోజు నేను దేవుణ్ని ప్రార్థిస్తాను.. నీ హృదయం కోరుకున్న ప్రతిదీ నీకు దక్కేలా చేయమని. ఐ లవ్ యు ఫర్ ఎవర్. హ్యాపీ బర్త్ డే చై." అంటూ సామ్ విష్ చేయనంటూనే బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు చెప్పింది. ఇక చైతూతో ఎంతో స‌న్నిహితంగా ఉండే రానా హ్య‌పీ బ‌ర్త్‌డే లిటిల్ క‌జిన్ అంటూ పెళ్లి టైంలో దిగిన ఫోటోని జ‌త చేసి శుభాకాంక్ష‌లు తెలిపాడు. ప్రపంచంలోనే నాకు ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. లవ్యూ మై బ్రదర్‌. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని అఖిల్ ట్వీట్ చేశాడు.. చై క‌జిన్ సుశాంత్ కూడా బ‌ర్త్‌డే విషెస్ తెలిజేస్తూ వెరైటీ పిక్ పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం తాను న‌టిస్తున్న స‌వ్య‌సాచి సెట్‌లోను చైతూ బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేశారు. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు కూడా చైతూకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.


1592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS