సమంత కౌంటర్ కు షాక్ అయిన సిద్దార్థ్

Sun,November 29, 2015 10:32 AM
samantha counters to her lover

గతంలో సమంత,సిద్దార్ధ్ ల మధ్య కొన్ని రోజులు ప్రేమాయణం నడిచిందన్న విషయం అందరికి తెలిసిందే.ఆ తర్వాత వీరిరివురు వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకొని ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు.అయితే తాజాగా వీరిరివురి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ అభిమానులకు పలు అనుమానాలను కలిగిస్తున్నాయి.ట్విట్టర్ సాక్షిగా వీరిరివురు చేసుకున్న కామెంట్స్ చాలా ఘూటుగా ఉండడంతో అభిమానులు ఆందోళనలో పడుతున్నారు.

సిద్దార్ధ్ ఇటీవల గతంలో నీకు జరిగిన చెడు అంతా నీ మంచికే జరిగిందని తెలుసుకున్నప్పుడు నీ మనసు ప్రశాంతంగా అనిపిస్తుందని ట్టిట్టర్ లో కామెంట్ చేయగా, ఈ పోస్ట్ కు సమంత నుండి వెంటనే రిైప్లె వచ్చింది. నీ పరిచయం గుర్తులేనంత మాములు వ్యక్తినని నేను భావిస్తున్నాను అంటూ సిద్దార్ధ్ కు కౌంటర్ ఇచ్చింది సమంతా.అయితే పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే ఆ ట్వీట్ ను డిలీట్ చేసిన సమంతా అభిమానులను పెద్ద కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది.అయితే సడెన్ గా వీరిరివురు ఎందుకు ఇలా కామెంట్ చేసుకుంటున్నారు అన్న విషయం పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.

సమంతతో బ్రేకప్ తర్వాత సిద్దార్ధ్ తన సినిమాల వేగం పెంచడమే కాకుండా త్రిషతో అరన్మణై 2 సినిమాలో నటిస్తున్నాడు.ఈ మధ్య వీరిద్దరిపై రాత్రివేళ చెన్నై బీచ్ లో ఓ రొమాంటిక్ సాంగ్ ను తెరకెక్కించారట.ఈ పాట చిత్రీకరణ సమయంలో వీరి మధ్య సాన్నిహిత్యం చాలా పెరిగిందని కోలివుడ్ మీడియా కోడై కూస్తోంది.

సమంత దృష్టికి సిద్దార్ధ్ గాసిప్పులు చేరడంతో ఈ అమ్మడు ఇంతలా రియాక్ట్ అయిందని కొందరు అంటుండగా,ఇద్దరి మద్య ఇలాంటివేమి లేవని మరి కోందరు వాదిస్తున్నారు.మరి వీటిపై క్లారిటీ ఎప్పటికి వస్తోందో చూడాలి

4146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles