ద్వి భాష చిత్రం చేస్తున్నట్టు తెలిపిన సమంత

Wed,January 24, 2018 11:31 AM
samantha confirms her next project

ఆ మధ్య తన పెళ్లితో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వచ్చిన సమంత ప్రస్తుతం తను ఎంచుకునే ప్రాజెక్టుల విషయంలో అందరిని ఆశ్చర్య పరుస్తూ వస్తుంది. రంగస్థలం 1985 అనే చిత్రంతో పాటు మహానటి, పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది సమంత. అయితే టాప్ హీరోయిన్ గా ఉన్న సమంతకి మంచి అభిరుచి ఎక్కువ. అందుకే ఓ కన్నడ మూవీని రీమేక్ చేయాలనే ఆలోచనలో సామ్ ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇది రూమర్ అని కొందరన్నారు. కాని ఇప్పుడు ఇదే నిజం అయింది. మిస్టరీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన కన్నడ సినిమా 'యూటర్న్' చిత్రాన్ని సమంత తెలుగు, తమిళ భాషలలో చేయాలనుకుంటుందట.

శ్రద్ధా శ్రీనాథ్ .. రోగర్ నారాయణ్ ప్రధానమైన పాత్రలలో యూటర్న్ అనే కన్నడ చిత్రం రూపొందగా,ఈ మూవీ భారీ విజయం సాధించింది. పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీని సమంత రీమేక్ చేసి తెలుగులో నిర్మిస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని తాను కేవలం ప్రధాన పాత్ర మాత్రమే పోషిస్తుందట. కన్నడ చిత్ర దర్శకుడు పవన్ కుమార్ బైలింగ్యువల్ మూవీని తెరకెక్కించనున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ చిత్రాన్ని నిర్మించనుంది. మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలు కానుందని సమంత తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. మీ సపోర్ట్ కి నా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది.1453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles