స‌మంత తల్లి కాబోతున్న‌ట్టు ప్రచారం..!

Tue,June 11, 2019 08:53 AM
samantha condense the rumors

వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళుతున్న అక్కినేని కోడ‌లు స‌మంత త్వ‌ర‌లో ఓ బేబీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నందిని రెడ్డి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని జూలై 5న విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు మేక‌ర్స్‌. ప్ర‌స్తుతం స‌మంత త‌న చిత్రానికి వెరైటీగా ప్రమోష‌న్స్ చేసుకుంటుంది. ఇందులో భాగంగా త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్ ఐడీని బేబీ అక్కినేని గా మార్చుకుంది. అయితే గ‌తంలో ఎప్పుడు ఇలా చేయ‌ని స‌మంత ప్ర‌త్యేకించి ఈ సినిమాకి చేసిందంటే ఏదో ప్ర‌త్యేక‌త ఉందని అభిమానులు ఆలోచ‌న‌లు చేశారు. కొంద‌రు స‌మంత త‌ల్లి కాబోతున్న నేప‌థ్యంలో ఇలా పెట్టుకుందేమో అంటూ పుకార్లు పుట్టించారు. ఓ నెటిజన్ స‌మంత‌ని ట్యాగ్ చేస్తూ మీరు త‌ల్లి కాబోతున్నారా ? అని అడిగాడు . ఇందుకు స‌మంత తీవ్ర స్థాయిలో ఖండిస్తూ, నేను త‌ల్లి కాబోతున్న విష‌యం మీకెప్పుడు తెలిసిందో మాకు కూడా చెప్పండి అంటూ కాస్త వ్యంగ్యంగా స్పందించింది. తాజాగా ఓ బేబీ చిత్రానికి సంబంధించి నాలో మైమ‌ర‌పు నాకే.. లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల కాగా, ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.


3091
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles