కిడ్నాప్ చేస్తానంటున్న సమంత

Fri,June 8, 2018 03:34 PM
samantha comments on cute boy performance

ఈ ఏడాదిలో లక్కీ పర్సన్ ఎవరంటే సమంత అని ఠక్కున చెప్పేయోచ్చు. తాను చేసిన అన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. రంగస్థలంలో రామలక్ష్మీగా, మహానటిలో మధురవాణిగా, అభిమన్యుడు చిత్రంలో రతిదేవిగా అద్భుత పాత్రలు పోషించి అలరించింది. అయితే సమంత తొలిసారి డీ గ్లామర్ పాత్ర పోషించిన రామలక్ష్మీ పాత్రకి మాత్రం ఎక్కువ మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు..’ పాటలో సామ్ ఎక్స్ ప్రెషన్స్ కి ఫిదా కాని వారు లేరు. పాట ఎంత అందంగా ఉందో ఆ సాంగ్ కి సమంత ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అంతకన్నా అందంగా ఉంది. ఈ పాటకి పండు ముసలి నుండి చిన్న పిల్లాడి వరకు డ్యాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తాజాగా ఓ చిన్నారి రంగమ్మ మంగమ్మ పాటకి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ చిన్నారి వీడియోని ఓ నెటిజన్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడకుండా ఉండలేరు అంటూ సుకుమార్, సమంత, అనసూయలకి ట్యాగ్ చేశాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత వెంటనే ఈ వీడియోని రీ ట్వీట్ చేస్తూ .. ‘సరే.. ఈ క్యూటీని నేను కిడ్నాప్ చేస్తా’ అంటూ లవ్ సింబల్స్ తో కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది. సమంత ప్రస్తుతం సూపర్ డీలక్స్, సీమ రాజా అనే తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తుంది సామ్. ఇదీ కాక యూ టర్న్ అనే రీమేక్ చిత్రం కూడా చేస్తుంది.
3957
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS