త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రంపై స‌మంత కామెంట్

Thu,October 18, 2018 11:39 AM
samantha comment on 96 remake

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , చెన్నై చంద్రం త్రిష జంటగా నటించిన త‌మిళ చిత్రం ’96’. ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న విడుద‌ల అయింది. ఇందులో విజ‌య్ సేతుప‌తి ఫోటోగ్రాఫ‌ర్‌గా క‌నిపించాడు. త్రిష స్కూల్ టీచ‌ర్‌గా క‌నిపించింది. పదో తరగతిలోనే ప్రేమలోపడ్డ రామ్‌(విజయ్‌), జాను (త్రిష)ల ప్రేమకథ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ఎంద‌రో సెల‌బ్రిటీల నుండి అభినంద‌న‌లు అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు దిల్ రాజు ఇప్ప‌టికే ఈ చిత్ర రైట్స్ తీసుకున్నారు. అతి త్వ‌ర‌లోనే మూవీకి సంబంధించి న‌టీన‌టులు వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

96 రీమేక్ లో నాని, స‌మంత న‌టించ‌నున్నార‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యంపై ఓ నెటిజ‌న్ తాజాగా స‌మంత‌ని ‘తెలుగు రీమేక్‌లో మీరు త్రిష పాత్రను పోషిస్తున్నారని విన్నాను. ఇది నిజమేనా సామ్‌?’ అని అడిగారు. దీనికి స్పందించిన స‌మంత .. త్రిష పాత్ర‌ని మ‌ళ్ళీ తెర‌కెక్కించ‌కూడ‌ద‌ని ట్వీట్ చేశారు. అంటే రీమేక్ మూవీలో స‌మంత న‌టించ‌న‌ట్టేనా అని అభిమానులు గుస‌గుస‌లాడుకుంటున్నారు. కాగా, స‌మంత తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో త్రిష పాత్ర‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. అంత క‌ష్ట‌మైన పాత్ర‌లో త్రిష ఒదిగిపోయిన తీరు చూస్తుంటే నాకు షాకింగ్‌గా ఉంది. ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న రానున్న రోజుల‌లోను కొన‌సాగించాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటాన‌ని ట్వీట్‌లో తెలిపింది సామ్. ప్ర‌స్తుతం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంతో బిజీగా ఉంది స‌మంత‌.2632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles