త‌న చేతిపై ఉన్న టాటూ గురించి వివ‌రించిన స‌మంత‌

Sun,July 1, 2018 11:38 AM
samantha clarifies about tattoo

ద‌క్షిణాదిలో ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న స‌మంత ఈ ఏడాది స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళుతుంది. పెళ్లి త‌ర్వాత కూడా త‌న స్పీడ్‌ని కొన‌సాగిస్తూ మంచి హిట్ చిత్రాలతో అభిమానుల‌కి కావ‌ల‌సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. ప్ర‌స్తుతం క‌న్న‌డ రీమేక్ యూట‌ర్న్ చిత్రంతో బిజీగా ఉన్న స‌మంత తన చేతిపై ఉన్న టాటూ గురించి వివ‌రించింది. తమ చేతిపై ఉన్న టాటూ రోమన్ సింబల్స్ లో ఒకటి కాగా దీని అర్థం మన రియాలిటీని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఆన్ స్క్రీన్ మీద తామిద్దరం ఆర్టిస్టులం కాబట్టి, ఆఫ్ స్క్రీన్ లో రియాలిటీలో బతకాలన్నది తమ ఆలోచనని తెలిపింది. ఇదే విధమైన టాటూ త‌న‌ భ‌ర్త చైతూ చెయ్యిపైనా ఉందని గుర్తు చేసింది స‌మంత. ఇక ఈ చిత్రంలో మోడ్ర‌న్ జ‌ర్నలిస్ట్‌గా క‌నిపించ‌నున్న స‌మంత పాత్ర కోసం హెయిర్ క‌ట్ చేసుకున్న‌ట్టు కూడా తెలిపింది. మ‌హాన‌టిలో 30 సంవత్సరాల క్రితంనాటి మహిళా విలేకరి పాత్ర కోసం జ‌డ వేసుకుంద‌నే విష‌యాన్ని కూడా ఈ సంద‌ర్భంగా గుర్తు చేసింది. ప్ర‌స్తుతం త‌మిళంలోను ప‌లు ప్రాజెక్ట్స్ చేస్తుంది సామ్.

4010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS