పేరు మార్చుకున్న సమంత..!

Thu,October 12, 2017 09:56 AM
samantha changes her name as akkineni samantha

చెన్నై బ్యూటీ సమంత టాలీవుడ్ గ్లామర్ హీరో నాగ చైతన్యతో కలిసి ఏడడుగులు వేయడంతో పాటు, రింగులు కూడా మార్చుకోవడంతో అక్కినేని కోడలిగా మారింది. ఈ నెల 6, 7 తేదీలలో సమంత, నాగ చైతన్యల వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం గ్రాండ్ గా జరిగింది. కేవలం కుటుంబ సభ్యుతులు,సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగడం విశేషం. అయితే మొన్నటి వరకు తన పేరును ట్విట్టర్ ఎకౌంట్ లో సమంత రూత్ ప్రభుగా ఉంచిన ఈ తమిళ అమ్మాయి ఇప్పుడు సమంత అక్కినేనిగా మార్చుకొని కంప్లీట్ తెలుగమ్మాయిగా అందరి ఆశీర్వాదాలు అందుకుంటుంది. ఇప్పుడు సమంతని ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆడపడచుగా ఫీలై విషెస్ తెలియజేస్తున్నారు. మరి కొద్ది రోజులలో నాగ చైతన్య, సమంతల రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుండగా, ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. ఇక ఈ వేడుక తర్వాత నాగ చైతన్య, సమంత వారి వారి ప్రాజెక్టులతో బిజీ కానున్నారు.

4829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles