స‌మంత త‌న మ్యారేజ్ గిఫ్ట్స్‌ని ఏం చేసిందో తెలుసా..!

Sun,January 21, 2018 05:05 PM
samantha auction her  marriage gifts

చెన్నై బ్యూటీ స‌మంత గ‌త ఏడాది నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి పెళ్లి గోవాలో ప్రైవేట్ పార్టీగా జ‌ర‌గ‌గా, రిసెప్ష‌న్ మాత్రం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ రెండు వేడుక‌ల‌కి సంబంధించి ఇద్ద‌రికి భారీ గిఫ్ట్సే వ‌చ్చాయ‌ని తెలుస్తుంది. అయితే ఈ గిఫ్ట్స్‌ని స‌మంత ఓ మంచి ప‌నికోసం ఉప‌యోగించింద‌ని స‌మాచారం. కొన్నేళ్ళుగా ప్ర‌త్యూష ఫౌండేష‌న్ అనే స్వ‌చ్చంద సేవా సంస్థ ద్వారా ఎంతో మంది అనాధ‌ల‌కి అండ‌గా ఉంటున్న స‌మంత ఈ గిఫ్ట్స్‌లో కొన్నింటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని ఫౌండేష‌న్‌కి అందజేసింద‌నే టాక్ న‌డుస్తుంది. దీనికి సంబంధించి భర్త నాగచైతన్య.. మావయ్య నాగార్జునల అనుమతి కూడా తీసుకుందట. వాళ్లు సంతోషంగా ఇందుకు అంగీకరించర‌డంతో వేలం వేసింద‌ట‌. గ‌తంలో కొందరు సెలబ్రెటీలకు సంబంధించిన వస్తువులు.. దుస్తుల్ని వేలం వేసిన స‌మంత‌ ఆ మొత్తాన్ని ఫౌండేషన్ కు అందజేసిన విష‌యం విదిత‌మే. ఏదేమైన న‌టిగానే కాదు, సేవా దృక్ప‌థంతో అంద‌రి మ‌న‌సుల‌ని గెలుచుకుంటున్న స‌మంత‌ని తప్ప‌క అభినందించి తీరాల్సిందే.

3509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS