చెన్నైలో కూర‌గాయ‌లు అమ్మిన స‌మంత‌

Sat,September 1, 2018 09:59 AM
Samantha Akkineni sells the vegetables

న‌టిగానే కాదు, సేవా దృక్ప‌థంతో అంద‌రి మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల భామ సమంత‌. పెళ్ళికి ముందు నుండే ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ ప్ర‌త్యూష ఫౌండేష‌న్ అనే స్వ‌చ్చంద సేవా సంస్థని స్థాపించింది. దీని ద్వారా ఎంతో మంది అనాధ‌ల‌కి అండ‌గా ఉంటుంది స‌మంత. గ‌తంలో కొందరు సెలబ్రెటీలకు సంబంధించిన వస్తువులు.. దుస్తుల్ని వేలం వేసిన స‌మంత‌ ఆ మొత్తాన్ని ఫౌండేషన్ కు అందజేసింది. ఇక త‌న పెళ్లికి వచ్చిన గిఫ్ట్స్‌లో కొన్నింటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని కూడా ఫౌండేష‌న్‌కి అందజేసింద‌నే టాక్ కూడా ఉంది. అయితే అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న త‌ర్వాత స‌మంత‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింది. కుటుంబంలో స‌భ్యురాలిగా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తూనే మ‌రోవైపు తోటి వారికి సేయం చేస్తుంది సామ్‌.

ప్రత్యూష చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో నటి సమంత అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల శస్త్రచికిత్సకి కావ‌ల‌సిన‌ ఆర్థిక సహాయం కోసం నిధులను సేకరిస్తున్నారు. ఈ క్ర‌మంలో చెన్నైలోని ట్రిప్లికేన్‌లో ఉన్న కూర‌గాయ‌ల దుకాణం ముందు కూర్చొని కూర‌గాయ‌లు అమ్మింది. స‌మంత‌ని చూసి అక్క‌డి జ‌నం భారీగా త‌ర‌లి వ‌చ్చారు. కొద్ది నిమిషాల‌లోనే షాప్‌లోని కూర‌గాయల‌న్నీ అమ్ముడుపోయాయి. స‌మంత చేస్తున్న మంచి ప‌నులకి నెటిజ‌న్స్ ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. స‌మంత న‌టించిన యూటర్న్ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

2787
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles