అల..వైకుంఠపురములో.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌ మెలోడీ

Fri,September 27, 2019 09:05 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురములో. సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ చిత్రంకి సంబంధించి తాజాగా మెలోడి సాంగ్ విడుద‌ల చేశారు. సామజవరగమన అంటూ సాగే ఈ పాట వింటుంటే థ‌మ‌న్ చిత్రానికి చాలా కూల్ ఆల్బ‌మ్ రెడీ చేశాడా అనిపిస్తుంది. సీతారామశాస్త్రి రాసిన ఈ పాటలోని మీనింగ్ ఫుల్ లిరిక్స్‌కి సిద్ శ్రీరామ్ వాయిస్‌లోని మ్యాజిక్ కూడా కలగలిసి అద్భుతహా అనిపించింది. త్వ‌ర‌లోనే ఫుల్ సాంగ్ విడుద‌ల చేయ‌నున్నారు. చిత్రంలో సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవ‌ల‌ చిత్రం నుండి పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇందులో బ‌న్నీ కారు ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చొని సిగ‌రెట్ అంటించుకుంటున్నాడు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది.


1470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles