సమంత ఎంజాయ్‌మెంట్ మాములుగా లేదు..!

Tue,January 3, 2017 08:10 AM
sam shares another pic of tour

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న సమంత త్వరలో పెళ్ళి పీటలెక్కనుంది. తను కోరుకున్న ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధమైంది. పెళ్ళి తర్వాత సినిమాలకు దూరం అవుతుందేమోనని అభిమానులు బాధపడుతున్న టైంలో పెళ్ళైనప్పటికి సినిమాలు చేస్తూనే ఉంటాను అనే స్టేట్ మెంట్ ఇచ్చి అభిమానులలో ఆనందం నింపింది. సమంత తమిళ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికి తన ఎంజాయ్ మెంట్ ని మాత్రం ఎక్కడ తగ్గనివ్వడంలేదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రియుడు నాగ చైతన్య తో కలిసి మాల్దీవులు వెళ్ళిన సమంత ఈ టూర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఇంక అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ లో ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళుతుంది. క్రిస్మస్ పండుగకి ముందే అక్కడికి చేరుకున్న ఈ లవబుల్ కపుల్ మూడు రోజుల పాటు తమ ఫ్రెండ్స్ తో కలిసి ఈ డేస్ ని సరదాగా ఎంజాయ్ చేశారట. తాజాగా తన ఎంజాయ్‌మెంట్ కి సంబంధించిన మరో పిక్ ని షేర్ చేసింది సమంత. ఈ జంట రీసెంట్ గా హైదరాబాద్ కి చేరుకోగా, ఇక కొన్నాళ్ల పాటు తమ ప్రాజెక్ట్స్ తో బిజీ కానుంది. జనవరి 29న చైతూ-సామ్ ల ఎంగేజ్ మెంట్ జరగనున్నట్టు సమాచారం.

2997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles