మ‌రోసారి జ‌ర్నలిస్ట్‌గా సామ్‌.. పోలీస్‌గా ఆది!

Fri,January 26, 2018 10:12 AM
sam plays journalist in remake movie

నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారిన స‌మంత పెళ్ళి త‌ర్వాత సినిమాల‌కి కాస్త దూరంగానే ఉండొచ్చ‌ని అభిమానులు భావించ‌గా, తాజాగా త‌న క్రేజీ ప్రాజెక్ట్ వివ‌రాలు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది సామ్. క‌న్నడలో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ సినిమాను తెలుగు, తమిళంలో ఏక కాలంలో తెరకెక్కించనుండ‌గా, ఇందులో స‌మంత ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. కన్నడ వర్షన్‌ను తెరకెక్కించిన పవన్ కుమార్ ఇప్పుడు రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఫిబ్రవరిలో పట్టాలెక్కనుంది. ఇది ఓ జర్నలిస్టు కథ. ఓ ఫ్లైఓవర్‌పై సంభవించిన కొన్ని మరణాలపై ఇన్వెస్టిగేషన్ చేసే జర్నలిస్టు పాత్రలో సమంత కనిపించనుంది. సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న మ‌హాన‌టిలోను స‌మంత జ‌ర్నలిస్ట్‌గా క‌నిపించ‌నుంద‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక తెలుగులో స్టైలిష్ విల‌న్‌గా అల‌రిస్తున్న ఆది పినిశెట్టి యూట‌ర్న్ రీమేక్‌ మూవీలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు. పోలీస్‌గా ఆది అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ని ప‌వ‌న్ కుమార్ తెలిపారు. స‌మంత బాయ్ ఫ్రెండ్ పాత్ర‌లో ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ పోషించనున్నాడు. మరోవైపు తమిళ స్టార్ హీరో సూర్య, సీనియర్ నటి భూమికా చావ్లాలు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. బైలింగ్యువ‌ల్ మూవీగా తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది.

1352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS