త‌న‌పై వ‌చ్చిన వ‌దంతుల‌కి కూల్‌గా జ‌వాబిచ్చిన స‌మంత‌

Sat,May 18, 2019 08:32 AM
sam clears the rumors in her instgram

ప్ర‌స్తుతం వరుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న స‌మంత‌కి రూమ‌ర్స్ కొత్తేమి కాదు. ఎంతో కూల్‌గా ఉండే ఈ అమ్మ‌డు చాలా అవ‌స‌రం అనుకున్న విష‌యాల‌కే స్పందిస్తూ ఉంటుంది. కొద్ది రోజులుగా స‌మంత‌కి త‌న త‌ల్లికి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. నేను నా త‌ల్లిని చాలా న‌మ్ముతాను. మా అమ్మ చేసే ప్రార్ధ‌న‌లో మ్యాజిక్ ఉంద‌ని నేను ఇప్ప‌టికి న‌మ్ముతాను. చిన్న‌తనంలో లానే ఇప్ప‌టికి నా కోసం మా అమ్మ‌ని ప్రార్ధ‌న చేయ‌మ‌ని అడుగుతాను. అమ్మ ప్రార్ధ‌న చేస్తే అంతా సెట్ అవుతుంది. మా అమ్మ‌లో ప్ర‌త్యేకం ఏమంటే త‌న కోసం తాను ఎప్పుడు ప్రార్ధ‌న చేసుకోలేదు. రెండో దైవం త‌ల్లేనంటూ త‌న త‌ల్లి ఫొటోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి రూమ‌ర్స్‌కి చెక్ పెట్టింది సమంత. ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ బేబీ ఎంత చక్కగున్నావే చిత్రంలో నటిస్తోంది.

3588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles