ధైర్యానికి ముఖం ఉంటే అది నువ్వే క్వీన్ : సమంత

Thu,September 14, 2017 09:49 AM
sam appreciate on kangana

సౌత్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన కంగనా రనౌత్ పై ప్రశంసలు కురిపించింది. ఆ మధ్య హృతిక్, ఆదిత్య పంచోలిపై చేసిన కామెంట్స్ తో వార్తలలోకి వచ్చిన కంగనా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలని టార్గెట్ చేస్తూ ఓ పాట రూపొందించింది. ఈ పాటని బట్టి చూస్తే హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కోసమే సినిమాలలో వాడుతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తుంది. మహిళా సాధికారత ప్రకటించేందుకే ఈ సాంగ్ చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి.

"చిట్టియా కలైయా వే" పాటను రీరైట్ చేసి.. "కాజ్ ఐ హ్యావ్ వెజైనా రే" అంటూ మార్చిన పాటలో దర్శకుడు హీరోకి హారతి పళ్ళెం పట్టి స్వాగతం చెప్పడం, హీరోకి భజన చేయడం వంటివి ప్రస్తుత రోజులలో జరుగుతున్నాయని సాంగ్ తో చెప్పేసింది. ఫిమేల్ లీడ్ అంటే హీరోయిన్ ని దర్శకుడు గుర్తు పట్టకపోవడం.. లవ్ ఇంట్రెస్ట్ అంటేనే గుర్తుకు రావడం ఫెమినా జీ అంటూ పాటలో హీరో పలికించడం.. ఆ తర్వాత హీరో పేర్ల తర్వాత మా పేర్లు.. కానీ మా కంటే వాళ్ల చెక్కులలో ఎక్కువ సున్నాలు అంటూ కౌంటర్లు వేయడం.. ఇలా ఒక పాటలో ఎన్ని చేయచ్చో అన్నీ చేసేసింది కంగనా రనౌత్.

ఇది నచ్చిన సమంత 'లెజెండరీ.. ధైర్యానికంటూ ఓ ముఖం ఉంటే అది నువ్వే మై క్వీన్..' అని ట్వీట్ పెట్టింది. ఈ మధ్య జ్యోతిక కూడా పురుషాధిక్యతపై మండిపడింది. చిత్ర పరిశ్రమలో హీరోల సినిమాలు ఎంత చెత్తగా ఉన్నప్పటికి నాలుగైదు రోజులు ఆడుతుంది. అదే లేడి ఓరియెంటెడ్ సినిమా ఎంత మంచి కథతో రూపొందినప్పటికి వారం తర్వాత వసూళ్ళు రావడం మొదలవుతాయి. మహిళలకి ఈ రంగంలో ప్రాముఖ్యత చాలా తక్కువ. ఈ పరిస్థితులు మారాలి గట్టిగా చెప్పింది. ఏదేమైన బాలీవుడ్ ప్రముఖుల తీరును విమర్శిస్తూ కంగన తీసిన ఓ మ్యూజిక్ వీడియో ప్రస్తుతం బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.


2340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles