మ‌రోసారి స‌మంత‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న కీర్తి సురేష్‌

Wed,June 6, 2018 08:18 AM

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రుగా ఉన్నారు స‌మంత‌, కీర్తి సురేష్‌. సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రంలో వీరిద్ద‌రు క‌లిసి న‌టించారు. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ క‌నిపించి త‌న న‌ట విశ్వ‌రూపం చూపిస్తే, స‌మంత మ‌ధుర‌వాణిగా అల‌రించింది. ఇక ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రు క‌లిసి ఒకే స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నున్నార‌ట‌. త‌మిళంలో శివ కార్తీకేయన్‌ హీరోగా పొన్‌రామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సీమరాజా’. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేష్‌ గెస్ట్‌గా నటించనున్నారు.ఈ చిత్రంలో న‌టించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంద‌ని పేర్కొది కీర్తి. చిత్రంలో కీర్తిది గెస్ట్ రోల్ అయిన‌ప్ప‌టికి మంచి ప‌వ‌ర్ ఫుల్ పాత్ర కావ‌డం వ‌ల‌న‌నే ఈ అమ్మ‌డు ఆ పాత్ర‌కి ఓకే చెప్పింద‌ని అంటున్నారు. మ‌రి సావిత్రి కాంబినేష‌న్ సీమ‌రాజా చిత్రంతో మ‌రోసారి అల‌రిస్తారేమో చూడాలి.

3793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles