సల్మాన్‌, శిల్పాశెట్టి పై కేసు నమోదు చేయాలని పిటిషన్..

Wed,January 17, 2018 05:20 PM
salmankhan, shilpa shetty get summons by rajasthan


ముంబై : బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, శిల్పాశెట్టి టీవీ రియాలిటీ షోలో చేసిన వ్యాఖ్యలపై దుమారం లేచిన విషయం తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సల్మాన్, శిల్పాశెట్టిపై కేసు నమోదు చేయాలని ముంబై బోయివాడ కోర్టులో ఇవాళ ఓ పిటిషన్ దాఖలైంది. ఇదిలా ఉంటే వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాజస్థాన్ పోలీసులు సల్మాన్, శిల్పాకు మరోసారి సమన్లు జారీచేశారు. ఈ ఇద్దరు యాక్టర్లు సోమవారం పోలీసులు ముందు హాజరుకావాల్సి ఉండగా అక్కడికి రాలేదు. అయితే అభ్యంతరకర వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు జనవరి 22 లోపు డుమ్మా కొట్టకుండా హాజరవ్వాలని చురూ పోలీసులు సమన్లు జారీ చేశారు. వీరితోపాటు ఫిల్మ్ ట్రేడ్ ఎనలిస్ట్ కోమల్ నహతాకు కూడా పోలీసులు సమన్లు జారీచేశారు. రియాలిటీ షోలో సల్మాన్, కత్రినాకైఫ్ భంగీ (ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పదం)అని వ్యాఖ్యానించి తమను అవమానించారని వాల్మీకి కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

1389
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles