చుల్‌బుల్ ఈజ్ బ్యాక్..దబాంగ్ 3 ట్రైలర్

Wed,October 23, 2019 06:53 PM


సోనాక్షిసిన్హా, సల్మాన్‌ఖాన్ కాంబోలో వస్తోన్న చిత్రం దబాంగ్ 3. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఒకరు పోలీస్ అవుతారు..మరొకరు గూండా అవుతారు అంటూ సల్మాన్‌ఖాన్ వాయిస్‌ఓవర్‌తో షురూ అయ్యే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతుంది. ట్రైలర్‌ను చూస్తుంటే సల్మాన్‌ఖాన్ మరోసారి చుల్‌బుల్ పాండేగా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం ఖాయమనిపిస్తోంది. సినిమాలో లవ్ ట్రాక్ కూడా కనిపిస్తోంది.


ఈ చిత్రంలో కన్నడ స్టార్ సుదీప్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. డిసెంబ‌ర్ 20న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

1123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles