టీమిండియా జెర్సీలో సల్మాన్ విషెస్

Mon,June 17, 2019 03:45 PM
salman wishes to team india with bharat movie style


ముంబై: ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్‌లో భాగంగా ఆదివారం (జూన్ 16న)మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పాక్‌పై విజయఢంకా మోగించిన కోహ్లీ అండ్ టీంకు పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

మాంచెస్టర్‌లో మన జాతీయ జెండాను రెపరెపలాడించిన కోహ్లీ టీంకు బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ తనదైన శైలిలో అభినందనలు, ప్రశంసలు తెలియజేశాడు. సల్మాన్‌ఖాన్ భారత్ సినిమా ైస్టెల్‌లో టీమిండియా జెర్సీ ధరించి కోహ్లీ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. భారత్ నుంచి టీమిండియాకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు సల్లూభాయ్. మరోవైపు బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్, లెజెండరీ సింగర్ ఆశా భోస్లే, గాయకుడు మికాసింగ్ భారత జట్టు సాధించిన విక్టరీపై ప్రశంసలు కురిపించారు.1370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles