వివాహవేడుకలో సల్మాన్, సోనాక్షి సందడి

Sun,February 17, 2019 05:17 PM

ముంబై : బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా కాంబినేషన్ లో దబాంగ్ 3 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. దబాంగ్ 3 షూటింగ్ మొదలవకముందే సల్లూభాయ్, సోనాక్షి జోడి ఓ వివాహ వేడుకలో తళుక్కున మెరిశారు. ముంబైలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్ లో సల్మాన్, సోనాక్షి సందడి చేశారు. సల్మాన్ బ్లాక్ కాస్ట్యూమ్స్ లెదర్ జాకెట్ తో కనిపించగా..సోనాక్షి నీలాకాశం రంగు శరారాలో మెరిసింది. సోనాక్షితోపాటు తల్లి పూనమ్ సిన్హా ఈ వేడుకకు హాజరైంది. దబాంగ్ 3 జంట వివాహ వేడుకకు హాజరైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.2949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles