తోడేళ్ళ‌తో స‌ల్మాన్ స్టంట్స్ చూశారా- వీడియో

Wed,December 13, 2017 03:50 PM
salman shocking stunts

2012 లో కబీర్ ఖాన్ తెరకెక్కించిన 'ఏక్ థా టైగర్' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం 'టైగర్ జిందా హై' . అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సల్మాన్, కత్రినా జంటగా నటించారు. కొద్ది రోజుల క్రితం చిత్ర ట్రైలర్ విడుదల కాగా, భారీ రేంజ్ లో వ్యూస్ దక్కించుకొని షాకిచ్చింది. ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా ట్రైలర్ ఉంది. ఇక డిసెంబర్ 22న‌ చిత్రాన్ని విడుదల చేయనుండగా , టీం ప్రమోషన్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా స‌ల్మాన్ తోడేళ్ళ‌తో పారాడే స‌న్నివేశానికి సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో సినిమా ఎలా ఉంటుంద‌నే దానిపై అభిమానుల‌లో అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్‌ యాక్షన్‌ దర్శకుడు టామ్‌ స్ట్రూథర్స్‌ సల్మాన్‌కు శిక్షణ ఇస్తున్నారు. సినిమామొత్తంలో తోడేళ్లతో పోరాట సన్నివేశాలే ఆకర్షణగా నిలుస్తాయని చిత్రవర్గాలు వెల్లడించాయి.



1774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS