సల్మాన్, రణ్ వీర్, సారా నాన్ స్టాప్ నవ్వులు..వీడియో

Sun,December 16, 2018 04:16 PM
salman, ranveer, sara cannot stop laughing in kapilshow

ముంబై: ప్రముఖ కమెడియన్, నటుడు కపిల్ శర్మ మరోసారి ది కపిల్ శర్మ షోతో కడుపుబ్బా నవ్వించేందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ షో తొలి ఎపిసోడ్ కు సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రణ్ వీర్ సింగ్ కూడా వీరితోపాటు షోలో పాల్గొన్నాడు. హిందీ ఛానల్ లో ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించిన మొదటి ప్రోమోను కపిల్ టీం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. సల్మాన్ తండ్రి సలీంఖాన్, సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, సింబా మూవీ టీం రణ్ వీర్ సింగ్, రోహిత్ శెట్టి (దర్శకుడు). సారా అలీఖాన్ తో కలిసి షోలో పాల్గొన్నాడు. తొలి ప్రోమోలో సల్మాన్ అండ్ టీం, కపిల్ నాన్ స్టాప్ నవ్వుతూ సందడి చేస్తున్నారు. కపిల్ ఏం జోకు వేశాడో..వారంతా అంతగా పొట్ట చెక్కలయ్యేలా ఎందుకు నవ్వుతున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

1929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles