సల్మాన్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా

Wed,September 7, 2016 12:51 PM
salman new look

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ .. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో ట్యూబ్‌లైట్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మనాలిలో జరుగుతోంది. సల్లూభాయ్ సరసన చైనీస్ భామ జూజు హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో సల్మాన్ లుక్ ఎలా ఉంటుందనే దానిపై అభిమానులు అనేక లెక్కలు వేసుకున్నారు. గతంలో ఈ చిత్రంకు సంబంధించి పోస్టర్ ని విడుదల చేసిన యూనిట్ సల్మాన్ ని బ్యాక్ నుండి మాత్రమే చూపించారు. దీంతో అభిమానులలో చాలా ఎగ్జైట్ మెంట్ నెలకొంది. ప్రస్తుతం ట్యూబ్ లైట్ సినిమాలోని సల్మాన్ ఖాన్ కి సంబంధించి కొన్ని లుక్స్ లీక్ అయ్యాయి. చెక్ షర్ట్ తో బ్రౌన్ స్వెటర్ వేసుకున్న సల్మాన్ ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పిక్స్ లో సల్మాన్ చాలా హంబుల్ గా కనిపిస్తున్నాడు. ట్యూబ్ లైట్ మూవీ యూనిట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా తర్వాతి షెడ్యూల్ కాశ్మీర్ లో జరపనున్నట్టు సమాచారం. ఈ చిత్రం 1962లో ఇండియా-చైనా మధ్య జరిగిన యుద్ద నేపధ్యంతో తెరకెక్కుతుంది. సల్మాన్, కబీర్ ఖాన్ ల కాంబినేషన్ లో ఇప్పటికే రెండు చిత్రాలు తెరకెక్కగా ట్యూబ్ లైట్ మూడో చిత్రంగా రూపొందుతుంది.

A photo posted by Kabir Khan (@kabirkhankk) on


2699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles