మై లవ్‌ను కోల్పోయిన సల్మాన్ ఖాన్

Fri,October 19, 2018 04:43 PM
Salman Khans pet dog My Love dies in Mumbai

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పెంపుడు కుక్క మై లవ్ ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని సల్మాన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. నెపోలిటన్ మాస్టిఫ్ జాతికి చెందిన ఈ శునకాన్ని సల్మాన్ మై లవ్ అని ముద్దుగా పిలుస్తుంటాడు. మై లవ్ మృతితో భావోద్వేగానికి లోనైన సల్మాన్.. ఆ శునకం ఫోటోకు ఓ క్యాప్షన్ ఇచ్చారు. నా అందమైన మై లవ్ ఇవాళ ప్రాణాలు విడిచింది, దాని ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సల్మాన్ పోస్ట్ చేశాడు. పెంపుడు కుక్కలంటే సల్మాన్‌కు ఎంతో ఇష్టం. గతంలోనూ అతను పెంచుకున్న రెండు శునకాలు చనిపోయాయి. 2009లో మైసన్, మైజాన్ అనే రెండు డాగ్స్ ప్రాణాలు విడిచాయి. ఆ రెండింటి కోసం మెహబూబా స్టూడియో సమీపంలో ఉన్న గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద స్మారకాన్ని నిర్మించారు.

View this post on Instagram

Kisses my love.....

A post shared by Salman Khan (@beingsalmankhan) on


View this post on Instagram

My most beautiful my love gone today. God bless her soul.

A post shared by Salman Khan (@beingsalmankhan) on

3807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles