క‌మ‌ల్‌తో స‌ల్మాన్.. ఫోటోలు వైర‌ల్‌

Tue,July 17, 2018 12:18 PM
salman khana and kamal photos goes viral

ఇద్ద‌రు స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో క‌నిపిస్తే అభిమానుల ఆనందానికి ఎల్లలు హ‌ద్దులు ఉండ‌వ‌నే చెప్పాలి. తాజాగా ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్‌, బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఒకే ఫ్రేములో కనిపించి సంద‌డి చేశారు. వీరి ఫోటోల‌ను ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ చేసేస్తున్నారు. స‌ల్మాన్ నిర్వ‌హిస్తున్న రియాలిటీ షో ‘దస్‌కాదమ్‌’ షోలో క‌మ‌ల్ పాల్గొన్నారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న విశ్వ‌రూపం 2 చిత్రంలో భాగంగా క‌మ‌ల్ ఈ షోకి వెళ్ళారు. ఇందులో చిత్ర విశేషాలు తెలిపారు. జూలై 22న సోనీ టీవీలో ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంది. క‌మ‌ల్ విశ్వ‌రూపం2 విష‌యానికి వ‌స్తే .. విశ్వ‌రూపం చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. క‌మ‌ల్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. అవినీతికి వ్య‌తిరేఖంగా సాగే యుద్ధ నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ని స‌మాచారం.


1105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS