దృఢంగా ఉండటమే కాదు.. బాడీ ఫ్లెక్సిబుల్‌గానూ ఉండాలి: సల్మాన్ ఖాన్

Wed,June 19, 2019 06:44 PM
Salman Khan workouts video goes viral

ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ అంటేనే సల్మాన్ ఖాన్. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన ఫిట్‌నెస్ కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లు దాటినా.. సల్మన్ ఎంత దృఢంగా ఉంటారో అందరికీ తెలుసు. ఆయన వ్యాయామం చేస్తున్న వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తుంటాడు.

అంతే కాదు.. ఆయన బీయింగ్ స్ట్రాంగ్ అనే ఫిట్‌నెస్ బ్రాండ్‌కు అంబాసిడర్ కూడా. జిమ్ పరికరాలను ఆ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. తాజాగా బీయింగ్ స్ట్రాంగ్.. జిమ్ పరికరాలను గత రెండు నెలల్లో 100 జిమ్ సెంటర్లకు సప్లయి చేసిందంటూ సల్మాన్.. తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

అంతే కాదు.. తన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో చెప్పేలా ఓ వీడియోను కూడా సల్మాన్ షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వావ్.. సల్మాన్ భాయ్ నువ్వు నిజంగా గ్రేట్. ఇప్పటికీ నువ్వు ఇంత ఫిట్‌గా ఉన్నావంటే నువ్వు ఇంకా ఎంత కష్టపడుతున్నావో అర్థం అవుతోంది.. అంటూ సల్మాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

2973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles