డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు 35 కోట్లు ఇవ్వ‌నున్న స‌ల్మాన్‌

Fri,August 11, 2017 01:47 PM
డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు 35 కోట్లు ఇవ్వ‌నున్న స‌ల్మాన్‌

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్ పెద్ద మ‌న‌సు చాటుకున్నాడు. త‌న ఈద్ మూవీ ట్యూబ్‌లైట్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ‌టంతో న‌ష్టాల్లో కూరుకుపోయిన డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల‌ను ఆదుకోవ‌డానికి ముందుకొచ్చాడు. ఈ మూవీ ఫ్లాప‌వ‌డంతో సుమారు రూ.70 కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు అంచ‌నా. అందులో సగం అంటే రూ.35 కోట్లు ఇవ్వ‌డానికి సల్మాన్ సిద్ధ‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని ట్రేడ్ అన‌లిస్ట్ కోమ‌ల్ నాతా వెల్ల‌డించాడు. ఈ మొత్తాన్ని డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల‌కు ఇవ్వ‌నున్నాడు. గ‌తంలోనే ఈ మొత్తం ఇవ్వ‌డానికి స‌ల్మాన్ అంగీక‌రించాడు. తొలి రోజే రూ.21 కోట్ల క‌లెక్ష‌న్ల‌తో ట్యూబ్‌లైట్ ప‌ర్వాలేద‌నిపించినా.. నెగ‌టివ్ టాక్ రావ‌డంతో ఆ త‌ర్వాత ఆ మేర‌కు క‌లెక్ష‌న్లు రాలేదు. తొలి వీకెండ్‌లో కేవ‌లం రూ.64 కోట్లు వ‌సూలు చేసింది. జులై చివ‌ర్లోగానే ఈ మొత్తం వాళ్ల‌కు ఇస్తాన‌ని స‌ల్మాన్ చెప్పినా.. ఐఫా అవార్డుల్లో బిజీగా ఉండటంతో త్వ‌ర‌లోనే ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

1960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS