వైరల్‌గా మారిన సల్లూభాయ్ సాంగ్..

Sun,July 16, 2017 05:20 PM
salman khan sing a song in iifa awards 2017


న్యూయార్క్: తన యాక్టింగ్‌తో ఓ వైపు కన్నీళ్లు తెప్పిస్తూ, మరోవైపు వినోదాన్ని అందించే టాప్ యాక్టర్లలో ముందుంటాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్. క్లాస్, మాస్, ఎక్స్‌పరిమెంటల్ మూవీలతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు ఈ బాడీగార్డ్. తాజాగా సల్మాన్ ఖాన్ ఐఫా వేడుకల్లో సింగర్ గా మారి ఆడియెన్స్ నుంచి క్లాప్స్ కొట్టించుకున్నాడు. న్యూయార్క్‌లో జరిగిన ఐఫా 2017 అవార్డ్సు ప్రదానోత్సవ కార్యక్రమంలో సల్మాన్ పాడిన మై హూ హీరో తేరా సాంగ్‌ను యాక్టర్ రితేశ్ దేశ్‌ముఖ్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. సల్లూభాయ్ పాడిన పాటకు ఆడియెన్స్, ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తున్నది. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


1440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS