ఊర్వశి సాంగ్‌కి స్టెప్పులేసిన స‌ల్మాన్, ప్ర‌భుదేవా

Wed,July 10, 2019 01:21 PM
Salman Khan shakes a leg with Prabhudeva

1994లో వచ్చిన ‘ప్రేమికుడు’ చిత్రంలో ఊర్వశి ఊర్వశి టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి పాటకు ఎంతో క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏఆర్ రెహ‌మాన్ స్వ‌ర‌ప‌ర‌చిన క్లాసిక్ సాంగ్ ఇప్ప‌టికీ సంగీత ప్రియుల మ‌దిలో మెదులుతూనే ఉంది. ఈ సాంగ్‌కి ప్ర‌భుదేవా వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌ని ఎంత‌గానో అల‌రించాయి. తాజాగా ఈ సాంగ్‌కి స‌ల్మాన్ ఖాన్, ప్ర‌భుదేవా, సుదీప్‌, సాజిద్ న‌డియావాలా క‌లిసి స్టెప్పులు వేశారు. ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫీలో స‌ల్మాన్‌, సుదీప్‌, సాజిద్ స్టెప్పులు వేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ దబాంగ్ 3 చిత్రం చేస్తుండ‌గా, ఇందులో సుదీప్ విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. సాజిద్ న‌డియా వాలా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సోనాక్షి సిన్హా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

1400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles