స‌ల్మాన్ హ‌త్య‌కి కుట్ర‌.. భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేసిన పోలీసులు

Wed,June 13, 2018 01:36 PM
Salman Khan  security beefed up as arrested gangster

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ హ‌త్య‌కి భారీగా కుట్ర జ‌రుగుతుంద‌నే విష‌యం తెలిసిందే. 1998లో వచ్చిన ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్‌ కృష్ణజింకను వేటాడిన‌ట్టు ఆరోప‌ణ‌లు రాగా, జోథ్ పూర్ కోర్టు స‌ల్మాన్‌ని దోషిగా తేల్చి ఐదేళ్ళు జైలు శిక్ష విధించింది . బిష్ణోయ్‌ ప్రజలు ఈ కేసుపై ప‌ట్టుబ‌ట్టుకు కూర్చోవ‌డం వ‌ల‌న‌నే 20 ఏళ్ళ కింద‌టి కేసు మ‌ళ్ళీ ఇటీవ‌ల విచార‌ణ‌కి వ‌చ్చింది. ఈ కేసు విష‌యంలో జోధ్ పూర్ సెంట్రల్ జైల్లో రెండు రోజులు గడిపిన స‌ల్మాన్ తర్వాత బెయిల్ పై బయటకి వచ్చాడు. అయితే స‌ల్మాన్‌కి క‌ఠిన శిక్ష ప‌డ‌క‌పోవ‌డంతో రాజస్ధానీ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణొయి స‌ల్మాన్‌ని చంపేస్తానంటూ జ‌న‌వ‌రిలో సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

ఆ మ‌ధ్య రేస్ 3 చిత్ర షూటింగ్ స‌మ‌యంలో కొంద‌రు వ్య‌క్తులు అనుమానాస్పదంగా క‌నిపించ‌టంతో వెంట‌నే పోలీసులకి స‌మాచార‌మిచ్చి షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చాడు స‌ల్మాన్‌. ప్ర‌స్తుతం ఈ బాలీవుడ్ స్టార్‌కి భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశార‌ట ముంబై పోలీసులు. అంతేకాదు స‌ల్మాన్‌ని చంపేందుకు హరియాణాకు చెందిన షార్ప్‌ షూటర్‌ సంపత్‌ నెహ్రా ప‌క్కా ప‌థ‌కం వేసాడ‌ని తెలుసుకున్న పోలీసులు ఆయ‌న‌ని అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. అయితే సంపత్‌ గ్యాంగ్‌లోని మరో ముగ్గురు షార్ప్‌ షూటర్స్‌ రాజు, అక్షయ్‌, అంకిత్‌ల ఆచూకిని మాత్రం గుర్తించలేకపోయారు. వీరి వ‌ల‌న స‌ల్మాన్‌కి ప్ర‌మాదం ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే వారిని కూడా ప‌ట్టుకుతీర‌తామ‌ని పోలీసులు చాలా న‌మ్మ‌కంతో ఉన్నారు.

2871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS