19 ఏళ్ళ త‌ర్వాత సెట్ అయిన క్రేజీ కాంబినేష‌న్‌

Sat,February 23, 2019 11:35 AM
Salman Khan, Sanjay Leela Bhansali Reunite again

1999 లో వ‌చ్చిన హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్ అనే క్లాసిక‌ల్ చిత్రాన్ని ఎలా మ‌రచిపోగ‌లం. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం సిల్వ‌ర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసింది. సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఈ చిత్రం ఇప్ప‌టికి సినీ ప్రియుల క‌ళ్ళెదుట క‌ద‌లాడుతూనే ఉంది. అయితే 19 ఏళ్ళ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్, సంజ‌య్ లీలా కాంబినేష‌న్ మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ద‌మైంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ ప్రాజెక్ట్‌ సెట్ అయింద‌ని ఈ మూవీ అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని బాలీవుడ్ ఎన‌లిస్ట్‌, క్రిటిక్ త‌ర‌ణ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. సంజ‌య్ దగ్గ‌ర ప్ర‌స్తుతం మూడు స్క్రిప్ట్స్ ఉండ‌గా, స‌ల్మాన్‌తో ల‌వ్ స్టోరీ చిత్రం చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సావ‌రియా(2007) చిత్రంలో ర‌ణ్‌బీర్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, స‌ల్మాన్ కామియోరోల్ పోషించిన సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ప్ర‌స్తుతం భార‌త్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈద్ కానుక‌గా విడుద‌ల కానుంది. మ‌రో వైపు కొత్త కుర్రాళ్ళ‌తో త‌న నిర్మాణంలో నోట్ బుక్ అనే సినిమా చేస్తున్నాడు. ప్ర‌నూత‌న్‌, జీహీర్ ఇక్బాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం మార్చి 29న విడుద‌ల కానుంది.


2428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles