మూడేళ్ళ త‌ర్వాత క‌శ్మీర్ ప‌య‌న‌మ‌వుతున్న‌ సల్మాన్‌

Sat,April 21, 2018 09:20 AM
Salman Khan returns to Kashmir after three years

కృష్ణ జింక‌ల వేట కేసులో స‌ల్మాన్‌కి జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష విధించిన సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల పాటు జైలులో ఉన్న‌స‌ల్మాన్ బెయిల్‌పై బ‌య‌ట‌కి వ‌చ్చి త‌న ప్రాజెక్ట్స్‌ని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్ర‌స్తుతం రెమో డిసౌజా ద‌ర్శ‌క‌త్వంలో రేస్ 3 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈద్ సంద‌ర్భంగా జూన్ 15న విడుద‌ల కానున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్తైంది. ఒక్క సాంగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంద‌ని తెలుస్తుండ‌గా, ఆ సాంగ్‌ని చిత్రీక‌రించేందుకు స‌ల్మాన్ అండ్ త్వ‌ర‌లో క‌శ్మీర్‌కి వెళ్ళ‌నున్నార‌ట‌. లీ, ల‌డ‌ఖ్ ప్రాంతాల‌లో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్న‌ట్టు స‌మాచారం. మూడు రోజుల పాటు చిత్ర బృందం అంతా క‌శ్మీర్‌లోనే ఉంటుంట‌. స‌ల్మాన్ న‌టించిన‌ భ‌జ‌రంగీ భాయిజాన్ చిత్రం కూడా క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. రేస్ 3 చిత్రంలో స‌ల్మాన్ స‌ర‌స‌న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. బాబీ డియోల్‌, సాఖిబ్‌ సలీం, అనిల్‌ కపూర్‌, డైసీ షాలు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్.. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అనే సినిమా చేశాడు. 2019 ఈద్ కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఈ మూవీ త‌ర్వాత కిక్2, ద‌బాంగ్ 3 చిత్రాలు కూడా చేయ‌నున్నాడు స‌ల్మాన్‌.

1648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS