స‌ల్మాన్ ఖాన్ సినిమా నుండి పాక్ సింగ‌ర్ ఔట్‌..!

Tue,February 19, 2019 01:14 PM
Salman Khan replaced Atif Aslam in Notebook

పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిని నిర‌సిస్తూ ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్‌కి చెందిన న‌టీన‌టులు, సింగ‌ర్స్‌ని పూర్తిగా నిషేధించాల‌ని వారు చెప్ప‌డంతో మేక‌ర్స్‌ ఒక్కొక్క‌రుగా త‌మ సినిమాలో పని చేస్తున్న పాక్ క‌ళాకారుల‌ని తొల‌గించి కొత్త వారిని తీసుకుంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం స‌ల్మాన్ ఖాన్ త‌న నిర్మాణంలో రూపొందిస్తున్న‌ నోట్ బుక్ సినిమా నుండి ప్ర‌ముఖ సింగర్ అతీఫ్ అస్లామ్‌ని తొల‌గించాడ‌ట‌. అతీఫ్ పాక్ క‌ళాకారుడు కావ‌డంతో అత‌నిని తొల‌గించి ఆయ‌న స్థానంలో అర్మాన్ మాలిక్‌ని తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా తన రాబోయే సినిమా ‘టోటల్ థమాల్’ను పాకిస్తాన్‌లో రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. స‌ల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న నోట్ బుక్ సినిమాలో జ‌హీర్ ఇక్బాల్‌, ప్ర‌నూత‌న్ భాల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రో వైపు స‌ల్మాన్ భారత్ అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈద్ కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది.

1540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles