మ‌రోసారి సింగ‌ర్ అవ‌తారం ఎత్త‌నున్న స‌ల్మాన్

Tue,March 5, 2019 11:18 AM
salman khan replace with Atif Aslam

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టుడు, నిర్మాత‌గానే కాదు సింగర్‌గాను సుప‌రిచితం. గతంలో సల్మాన్ ‘మై హూ హీరో తేరా’ సినిమాలోనూ పాట పాడారు. ప్ర‌స్తుతం త‌న నిర్మాణంలో రూపొందుతున్న నోట్ బుక్ సినిమా కోసం సింగ‌ర్ అవ‌తారం ఎత్త‌నున్నార‌ట‌. వివ‌రాల‌లోకి వెళితే పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిని నిర‌సిస్తూ ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్‌కి చెందిన న‌టీన‌టులు, సింగ‌ర్స్‌ని పూర్తిగా నిషేధించాల‌ని వారు చెప్ప‌డంతో మేక‌ర్స్‌ ఒక్కొక్క‌రుగా త‌మ సినిమాలో పని చేస్తున్న పాక్ క‌ళాకారుల‌ని తొల‌గించి కొత్త వారిని తీసుకుంటున్నారు. అయితే స‌ల్మాన్ ఖాన్ త‌న నిర్మాణంలో రూపొందుతున్న‌ నోట్ బుక్ సినిమా నుండి ప్ర‌ముఖ సింగర్ అతీఫ్ అస్లామ్‌ని తొల‌గించాడు. అతీఫ్ పాక్ క‌ళాకారుడు కావ‌డంతో అత‌నిని తొల‌గించి ఆయ‌న స్థానంలో వేరొక‌రిని తీసుకోవాల‌ని ప‌లువురి పేర్ల‌ని ప‌రిశీలించారు. కాని వాయిస్ స‌రిగ్గా సెట్ కాక‌పోవ‌డంతో చిత్ర నిర్మాత‌లు స‌ల్మాన్‌నే పాడ‌మ‌ని కోరార‌ట‌. దీనికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం భార‌త్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న స‌ల్మాన్ వచ్చే నెలలో ‘దబంగ్’ షూటింగ్ కోసం దుబాయ్‌కి వెళ్ల‌నున్నాడు. ఆ లోపు ఈ పాటను రికార్డు చేయనున్నారు. ‘నోట్ బుక్’ సినిమా మార్చి 29న విడుదల కానుంది.

953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles