నెంబర్ వన్ ట్రెండింగ్‌లో సల్మాన్ భాయ్ రేస్3 ట్రైలర్..!

Wed,May 16, 2018 05:14 PM
Salman Khan Race 3 Official Trailer Trending in youtube

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం రేస్3. ఈ చిత్రంలో సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా... అనిల్ కపూర్, డైసీ షా, బాబీ డియోల్, సాఖీబ్ సలీమ్, ఫ్రీడీ దరువాలా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రంజాన్ కానుకగా జూన్ 15, 2018 న మూవీని రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో రేస్ సీక్వెల్స్ సూపర్ డూపర్ హిట్‌ కాగా.. తాజాగా రేస్3 పై భారీ అంచనాలు ఉన్నాయి. రెమో డిసౌజా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా మూవీ ట్రైలర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన ఒక్కరోజులోనే కోట్ల వ్యూస్‌ను ఈ మూవీ సొంత చేసుకోవడమే కాకుండా యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నది. 'సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్' అనే యూట్యూబ్ చానెల్‌లో 90 లక్షల మంది ఈ ట్రైలర్‌ను వీక్షించగా.. 'టిప్స్ అఫీషియల్' అనే చానెల్‌లో దాదాపు 92 లక్షల మంది వీక్షించారు.

2197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles