బాలీవుడ్‌కి మ‌రో ఇద్ద‌రిని పరిచ‌యం చేస్తున్న స‌ల్మాన్‌

Sat,February 23, 2019 08:57 AM
Salman Khan presents Pranutan Bahl, Zaheer Iqbal to bollywood

సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఒక‌వైపు తాను హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు నిర్మాత‌గా ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ని ప‌రిచ‌యం చేస్తున్నాడు. క‌త్రినా కైఫ్‌, అర్జున్ క‌పూర్, జ‌రీన్ ఖాన్, డైసీ షా నుండి సూరజ్ పాంచాలి, ఆదిత్య శెట్టి వ‌ర‌కు ఇలా ప‌లువురు న‌టీన‌టుల‌ని భాయ్‌జాన్ బాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేశాడు. ప్ర‌స్తుతం నోట్ బుక్ చిత్రం ద్వారా ఇద్ద‌రు కొత్త వాళ్ళని హిందీ ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం చేస్తున్నాడు స‌ల్మాన్‌. త‌న తాజా నిర్మాణ సంస్థ స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ బేన‌ర్‌పై నోట్‌బుక్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు స‌ల్లూ భాయ్. ప్ర‌నూత‌న్ బాల్‌, జ‌హీర్ ఇక్బాల్ ఈ చిత్రంతో బాలీవుడ్‌కి డెబ్యూ ఇస్తున్నారు. నితిన్ క‌క్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులోని డైలాగుల‌తో పాటు స‌న్నివేశాలు మ‌న‌సుకి హ‌త్తుకునేలా ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం కాశ్మీర్‌లోనే జ‌ర‌గ‌గా, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మూవీ తెర‌కెక‌క్కుతున్న‌ట్టు తెలుస్తుంది. మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles