యంగ్ లుక్‌లో స‌ల్మాన్‌.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్

Tue,April 16, 2019 11:24 AM
Salman Khan new look revealed form bharat

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న తాజా చిత్రం భార‌త్ . అలీ అబ్బాస్‌ జాఫర్‌ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా క‌త్రినా కైఫ్‌, దిశా ప‌ఠానీ న‌టించారు. చిత్రంలో సల్మాన్‌ 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ రకాల లుక్స్‌లో కనిపిస్తారట. ఈద్ కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. కొరియ‌న్ చిత్రం రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు మేక‌ర్స్. నిన్న ముస‌లి గెట‌ప్‌లో ఉన్న స‌ల్మాన్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేసిన టీం తాజాగా యంగ్ లుక్‌లో ఉన్న స‌ల్మాన్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. దేశ విభ‌జ‌న కాలం నాటి క‌థ‌తో రూపొందుతున్న భార‌త్ ప్రేక్ష‌కులని త‌ప్ప‌క మెప్పిస్తుంద‌ని యూనిట్ చెబుతుంది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ద‌బాంగ్ 3 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

1442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles