జ‌మ్మూ కశ్మీర్ ముఖ్య‌మంత్రిని క‌లిసిన స‌ల్మాన్‌

Wed,April 25, 2018 01:54 PM
Salman Khan meets  Kashmir cm Mehbooba Mufti

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం రెమో డిసౌజా ద‌ర్శ‌క‌త్వంలో రేస్ 3 చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈద్ సంద‌ర్భంగా జూన్ 15న విడుద‌ల కానున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్తైంది. ఒక్క సాంగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంద‌ని తెలుస్తుండ‌గా, ఆ సాంగ్‌ని చిత్రీక‌రించేందుకు స‌ల్మాన్ అండ్ టీం క‌శ్మీర్‌కి వెళ్లింది. శ్రీనగర్ ప్రాంతంలోని సోనామార్గ్ హిల్ స్టేషనులో రెండురోజుల పాటు షూటింగ్ జ‌రిపారు. ఆ త‌ర్వాత‌ జ‌మ్ము కశ్మీర్ ముఖ్య‌మంత్రి మెహ‌బూబా మ‌ఫ్తీని క‌లిసారు. స‌ల్మాన్ బృందానికి సాద‌ర స్వాగ‌తం ప‌లకిన మెహ‌బూబా వారితో గంట‌సేపు చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది. లీ, ల‌డ‌ఖ్ ప్రాంతాల‌లో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్న‌ట్టు స‌మాచారం.

భ‌జ‌రంగీ భాయిజాన్ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో క‌శ్మీర్ వెళ్లిన స‌ల్మాన్ మ‌ళ్లీ మూడేళ్ళ త‌ర్వాత రేస్ 3 షూటింగ్ కోసం అక్క‌డికి వెళ్ళాడు. రేస్ 3 చిత్రంలో స‌ల్మాన్ స‌ర‌స‌న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. బాబీ డియోల్‌, సాఖిబ్‌ సలీం, అనిల్‌ కపూర్‌, డైసీ షాలు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్.. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అనే సినిమా చేయ‌నున్నాడు. 2019 ఈద్ కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఈ మూవీ త‌ర్వాత కిక్2, ద‌బాంగ్ 3 చిత్రాలు కూడా చేయ‌నున్నాడు స‌ల్మాన్‌.



1211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS