స‌ల్మాన్ వ‌ర్క‌వుట్ చూస్తే షాకవ్వాల్సిందే..!

Tue,June 18, 2019 12:33 PM
Salman Khan  Leg Exercise With His Bodyguards Going Viral

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఐదు ప‌దుల వ‌య‌స్సులోను ఎంత ధృడంగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేస్తూ త‌న ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటున్న‌ స‌ల్మాన్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాయామంకి సంబంధించి ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో స‌ల్మాన్ చేసే వ‌ర్క‌వుట్ అంద‌రు నోళ్ళెళ్ళ‌పెట్టేలా చేస్తుంది. బాడీ గార్డ్స్ పైన కూర్చొని ఉండ‌గా, స‌ల్మాన్ కాళ్ళ‌తో వారిని పుష‌ప్ చేస్తున్నాడు. చెమ‌ట‌లు కారుస్తూ స‌ల్మాన్ చేస్తున్న ఈ వ‌ర్కవుట్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రీసెంట్‌గా స‌ల్మాన్ భార‌త్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని ఎంతగానో గెలుచుకుంది.

1910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles