భారత్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది

Sun,August 26, 2018 12:32 PM
Salman Khan Katrina Kaif Starer Bharat movie first look out

సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్ జంటగా నటిస్తున్న భారత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మాల్టా షెడ్యూల్‌ను పూర్త చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ జాఫర్‌తోపాటు సల్మాన్, కత్రినా ఫస్ట్ లుక్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత్ ద ఫిల్మ్ మాల్టా షెడ్యూల్ పూర్తయిందంటూ జాఫర్ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. బ్లాక్ షేర్వాణీలో సల్మాన్, ఎమరాల్డ్ లెహెంగాలో కత్రినా అదుర్స్ అనిపించేలా ఉన్నారు. ఇప్పటికే ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, పార్ట్‌నర్, యువరాజ్‌లాంటి హిట్ మూవీస్‌లో కలిసి నటించిన ఈ జోడీ.. మరోసారి భారత్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ ఫస్ట్ లుక్ కూడా దాదాపు టైగర్ జిందా హై మూవీ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లాగే ఉంది. ఈ ఇద్దరితోపాటు టబు, దిశా పటానీలాంటి నటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్‌తో సల్మాన్ కలిసి పనిచేయడం ఇది మూడోసారి. భారత్ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 5న రిలీజ్ కానుంది.

Malta #schedule wrapped @bharat_thefilm @beingsalmankhan @katrinakaif

A post shared by ali (@aliabbaszafar) on

2884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles