జుడ్వా2 టీమ్ తో జ‌త‌క‌ట్టిన స‌ల్మాన్... వైర‌ల్ ఫోటోలు

Sun,July 9, 2017 03:58 PM
Salman Khan joins Judwa2 team for cameo role

అది 1997... స‌ల్మాన్ ఖాన్, క‌రీష్మా క‌పూర్, రంభ జంట‌గా న‌టించిన మూవీ జుడ్వా వ‌చ్చిన ఇయ‌ర్ అది. ఇప్పుడు అదే మూవీకి కొన‌సాగింపుగా వ‌స్తున్న‌ది జుడ్వా2. అయితే.. ఈ మూవీలో హీరోగా వ‌రుణ్ ధావ‌న్ న‌టిస్తుండ‌గా.. హీరోయిన్లుగా జాక్వెలిన్, తాప్సీ న‌టిస్తున్నారు. అయితే.. ఈ మూవీలో స‌ల్మాన్ భాయ్ అతిథి పాత్ర‌లో నటిస్తున్నాడు. భాయ్ జాన్ తో షూటింగ్ కూడా పూర్తయింది. ఇక‌.. షూటింగ్ పూర్త‌య్యాక‌.. స‌ల్మాన్ తో మూవీ యూనిట్ ఫోటోలు దిగింది. సల్మాన్ తో దిగిన ఫోటోల‌ను త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో షేర్ చేశారు వ‌రుణ్, జాక్వెలిన్, తాప్సీ. అంతే కాదు.. స‌ల్మాన్ భాయ్ తో న‌టించింది కొంత సేపే అయినా.. ఆయ‌న తో న‌టించ‌డం మ‌రిచి పోలేని అనుభూతి అంటూ షూటింగ్ లో జ‌రిగిన తీపి గుర్తుల‌ను త‌మ అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. ఇక‌.. సోష‌ల్ మీడియాలో ఆ ఫోటోలు తెగ సంద‌డి చేస్తున్నాయి.


A post shared by Varun Dhawan (@varundvn) onA post shared by Taapsee Pannu (@taapsee) on

1159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles