క‌న్నీరు పెట్టుకున్న స‌ల్మాన్ ఖాన్

Wed,September 19, 2018 01:12 PM
Salman Khan Gets Emotional While Interacting With Children

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ స్టార్ హీరోగానే కాదు మంచి మాన‌వ‌తావాదిగా అభిమానుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. సినిమాల‌తో అల‌రించే స‌ల్మాన్ ఖాన్ ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ, ఆప‌ద‌లో ఉన్నవారికి తనవంతు సాయం అందిస్తుంటాడు. ముస్లిం అయిన స‌ల్మాన్ హిందూ దేవుడ‌యిన గ‌ణేష్‌ని త‌న ఇంట్లో ప్ర‌తిష్టించుకొని కొలుస్తుంటాడు. సల్మాన్ ఖాన్ తాను ముస్లిమ్ అయినా వినాయకుడు అంటే ఎంతో భక్తి అంటాడు. ముఖ్యంగా ఇతర హిందీ సంప్రదాయాలను కూడా ఈ కండల వీరుడు ఎంతో గౌరవిస్తాడు. ఇక గణేష్ ఉత్సవాలు మొదలయ్యాయంటే చాలు తన ఇంట్లో కూడా ప్రతి రోజు పూజ చేసి తానే బ్యాండ్ మోతతో అందరిని ఆకర్షిస్తాడు. మ‌రి అంద‌రిలో ఎంతో ఎనర్జీ నింపే స‌ల్మాన్ తాజాగా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. మంగ‌ళ‌వారం జైపూర్‌లో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన సెంట‌ర్‌ని ప్రారంభించాడు. ఈ క్ర‌మంలో దివ్యాంగులు ప‌డుతున్న క‌ష్టాల‌ని చూసి క‌న్నీరు పెట్టుకున్నాడు. ఆ త‌ర్వాత పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దాగా డ్యాన్స్‌లు చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


4350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS