పాక్‌లో ‘ట్యూబ్‌లైట్’ వెలుగులు ఉండవట..!

Mon,May 1, 2017 12:20 PM
Salman Khan Film Might Not Release In Pakistan


ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ ‘ట్యూబ్‌లైట్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కబీర్‌ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ట్యూబ్‌లైట్ ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. సల్మాన్‌ఖాన్ సినిమాలు ఇప్పటికే పాక్‌లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే పాక్‌లో సల్మాన్ తాజా చిత్రం ట్యూబ్‌లైట్ విడుదలకు బ్రేక్ పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఈద్ (రంజాన్ )రోజు పాక్‌లో ట్యూబ్‌లైట్ సినిమా విడుదలైతే..పాక్ సినీ పరిశ్రమకు బిజినెస్ పరంగా నష్టాలు వచ్చే అవకాశముందని పాకిస్తానీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. తమ సినిమాలకు ఈద్ సెలవు రోజుల్లో మంచి బిజినెస్ జరగాలంటే పాక్‌లో ట్యూబ్‌లైట్ మూవీని నిలిపేయాల్సిందేనని పాకిస్థానీ యాక్టర్ ముస్తాఫా ఖురేషి తెలిపాడు. ఇండియన్ మూవీ పండుగ సమయాల్లో ఇక్కడ విడుదలైతే పాక్ సినీ పరిశ్రమకు ఏవిధంగా ఉపయోగపడదన్నాడు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళతామని నిర్మాత అల్తఫ్ హుస్సేన్ అన్నారు. ప్రధాని నవాజ్‌షరీఫ్‌కు వినతి పత్రం సమర్పించి ఈ అంశాన్ని పరిష్కరించాల్సిందిగా కోరతామని వెల్లడించారు.

2745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles