క‌శ్మీర్ స‌మ‌స్య‌.. ఇదీ స‌ల్మాన్ ఖాన్ ప‌రిష్కారం !

Thu,March 21, 2019 03:19 PM


హైద‌రాబాద్‌: క‌శ్మీర్ వివాదంపై బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఓ సూచ‌న చేశాడు. క‌శ్మీర్ లోయ‌ల్లో హింస త‌గ్గాలంటే ఏం చేయాలో ఆయ‌న చెప్పారు. క‌శ్మీర్ యువ‌త‌కు స‌రైన విద్య‌ను అందిస్తే ఆ స‌మ‌స్య తీరుతుంద‌ని అత‌ను అన్నారు. స‌ల్మాన్ నిర్మిస్తున్న నోట్‌బుక్ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా స‌ల్లూ .. మీడియాతో మాట్లాడారు. ఆ స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టులు క‌శ్మీర్ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్న‌లు వేశారు. దానికి స‌ల్మాన్ బ‌దులిచ్చారు. విద్య‌ను అందిస్తే క‌శ్మీర్‌లో మార్పులు వ‌స్తాయా అని ప్ర‌శ్నించారు. అప్పుడు స‌రైన విద్య‌ను అందిస్తే క‌శ్మీర్‌లో మార్పులు సాధ్య‌మే అని స‌ల్మాన్ అన్నారు. ఇటీవ‌ల పుల్వామాలో దాడికి పాల్ప‌డింది ఓ స్థానిక ఇంజనీరింగ్ విద్యార్థి. అత‌ను విద్య‌ను అభ్య‌సించాడు, కానీ అత‌ని ట్యూట‌ర్లు, టీచ‌ర్లు స‌రైన ప‌ద్ధ‌తిలో చ‌దువును చెప్ప‌లేద‌న్నారు. నోట్‌బుక్ సినిమా క‌శ్మీర్ నేప‌థ్యంలో సాగే ల‌వ్ స్టోరీ. ఈనెల 29వ తేదీన ఈ సినిమా రిలీజ్‌కానున్న‌ది.

2923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles