గ‌ణేష్ వేడుక‌ల‌లో పాల్గొనేందుకు స‌ల్మాన్‌..

Tue,September 11, 2018 12:56 PM
salman Khan attends for Ganesh Chaturthi 2018

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఫ్యామిలీ కుల‌మ‌తాల‌కి అతీతంగా ప్ర‌తి ఏడాది వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ని ఘ‌నంగా జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఎంతో నిష్ట‌తో ఈ ఫ్యామిలీ జ‌రిపే వేడుక‌ల‌కి బాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌వుతుంటారు. షూటింగ్‌ల‌తో స‌ల్మాన్ ఎంత బిజీగా ఉన్నా కూడా వినాయ‌క చ‌వితి స‌మ‌యానికి మాత్రం ముంబైలోనే ఉంటాడు. కాని 2016లో మాత్రం మనాలీలో ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రీకరణలో ఉండటం వల్ల ముంబైలో జ‌రిగిన వినాయక చవితి వేడుకలకు సల్మాన్‌ఖాన్‌ హాజరు కాలేకపోయారు. గ‌త ఏడాది స‌రిగ్గా నిమ‌జ్జ‌నం రోజున ముంబై చేరుకున్నారు.

ఈ ఏడాది త‌ప్ప‌కుండా గ‌ణేష్ వేడుక‌లలో పాల్గొనాల‌ని భావించిన స‌ల్మాన్ ఖాన్ త‌న తాజా చిత్రం భార‌త్ అబుదాబి షెడ్యూల్ వెన‌క్కి జ‌రిపాడ‌ట‌. త‌న సోద‌రి అర్పితా ఖాన్ ఇంట్లో జ‌ర‌గనున్న వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌లో త‌ప్ప‌క పాల్గొనాల‌ని భావించి, నిర్మాత‌ల‌తో మాట్లాడి ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. అర్పిత భ‌ర్త ఆయుష్ శ‌ర్మ ప్ర‌స్తుతం హీరోగా ల‌వ్ రాత్రి అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానున్న ఈ సినిమాని సల్మాన్ నిర్మిస్తున్నాడు. ఇక వినాయ‌క నిమ‌జ్జ‌నం ముగిసిన వెంట‌నే భార‌త్ మూవీ యాక్ష‌న్ ప్యాక్ట్ షెడ్యూల్ కోసం స‌ల్మాన్ అబుదాబి వెళ్ళ‌నున్నార‌ట‌. అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో క‌త్రినా కైఫ్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

2206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles