నీ వల్ల రేటింగ్స్ వదులుకోం.. సిద్దూకి స్పష్టం చేసిన సల్మాన్

Wed,February 20, 2019 01:26 PM
Salman Khan asked Navjot Singh Siddhu to step down from The Kapil Sharma Show

పుల్వామా దాడిపై నోరు జారిన నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూను ద కపిల్ శర్మ షో నుంచి తప్పుకోవాల్సిందిగా ఆ షో ప్రొడ్యూసర్ సల్మాన్ ఖాన్ స్పష్టం చేశాడు. ఈ షోకి మంచి రేటింగ్స్ వస్తున్న ఈ సమయంలో ఒక్కడి కోసం వాటిని వదులుకోలేమని సల్మాన్ అనడం విశేషం. కొద్ది మంది చేసిన పనికి మొత్తం దేశాన్ని నిందించడం సరికాదు అంటూ పాకిస్థాన్‌ను వెనకేసుకొచ్చేలా సిద్దూ మాట్లాడిన విషయం తెలిసిందే. సిద్దూ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కపిల్ శర్మ షోను బాయ్‌కాట్ చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. నిజానికి ఆయనను షో నుంచి సాగనంపారన్న వార్తలు కూడా వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్.. స్వయంగా సిద్దూకు ఫోన్ చేసి తప్పుకోవాలని అడిగినట్లు తెలిసింది.

సిద్దూను తొలగించడంపై తుది నిర్ణయం మాత్రం సల్మాన్ ఇంకా తీసుకోలేదు. అయితే ప్రస్తుతానికి సిద్దూ కొన్ని షోలకు దూరంగా ఉన్నారు. నిజానికి సిద్దూని తొలగించాలా వద్దా అన్నదానిపై సదరు చానెల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. కానీ ఆ షో ప్రొడ్యూసర్‌గా ఎలాంటి చాన్స్ తీసుకోవడానికి ఇష్టపడని సల్మాన్.. వెంటనే సిద్దూకి ఫోన్ చేసి తప్పుకోవాల్సిందిగా కోరాడు. ఇప్పటికీ ప్రొడ్యూసర్, సదరు చానెల్ మధ్య ఈ అంశంపై చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతానికి కొన్ని ఎపిసోడ్లకు సిద్దూని పక్కన పెట్టినా.. ఆయన మళ్లీ తిరిగొచ్చే అవకాశం ఉన్నట్లు షో వర్గాలు వెల్లడించాయి.

5823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles